తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్ని కంపార్ట్‌మెంట్లు ఉదయానికే ( జూన్ 15) నిండిపోయాయి. శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి యున్నారు. స్వామి దర్శనానికి 22 గంటల సమయం పడుతుంది.సర్వ దర్శనం టోకెన్ పొందిన వారికి 5 నుంచి 8 గంటల సమయం పడుతుంది, ఇక రూ. 300 ల శీఘ్రదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది.
నిన్న(జూన్ 14) స్వామివారిని 95వేల 094 భక్తులు దర్శించుకున్నారు. 35 వేల 909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.93 కోట్లు రాగా.. జూన్ 14న మొత్తం 4.66 లక్షల లడ్డూలను విక్రయించారు. నిత్య అన్న ప్రసాదాన్ని 3.23 లక్షల మంది స్వీకరించినట్లు నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
