- ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా
జ్యోతినగర్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న దాదాపు 1.11 కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీంపాషా పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేసిన నిరంతర కృషి ఎంతో ఉందన్నారు.
గురువారం ఆయన మాట్లాడుతూ కాకా కుటుంబం మొదటి నుంచి కార్మికుల పక్షపాతేనని ఆయన స్పష్టం చేశారు. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్య ఒప్పందం ప్రకారం సుమారు 10 వేల మంది కార్మికులకు పే -రివిజన్ అమలు చేయడంలో ఆలస్యం జరుగుతోందని, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సహకారంతో ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడించారు.
