V6 News

IPL 2022: ఈ సారి రెండు గ్రూపులుగా విడిపోయిన జట్లు

IPL 2022: ఈ సారి రెండు గ్రూపులుగా విడిపోయిన జట్లు

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–15 సీజన్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌ ను ప్రకటించింది బీసీసీఐ. మార్చి 26 న ప్రారంభమవ్వగా ఫైనల్ మ్యాచ్ మే 29న జరగనుంది.. ఈ మేరకు గురువారం జరిగిన ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ గవర్నింగ్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ (జీసీ)లో నిర్ణయం తీసుకుంది.  మొత్తం 10 టీమ్‌‌‌‌‌‌‌‌లు 72 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడే విధంగా షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది. ముంబైలోని వాంఖడే (20 మ్యాచ్​లు), బ్రబౌర్న్‌‌‌‌‌‌‌‌ (15), డీవై పాటిల్‌‌‌‌‌‌‌‌ (20) స్టేడియాలతో పాటు  పుణెలోని ఎంసీఏ స్టేడియం (15)ను వేదికలుగా ఎంపిక చేశారు. ఈ సారి ఏ టీం ఎన్నిసార్లు టైటిల్ గెలిచింది. ఏ టీం ఎన్ని సార్లు ఫైనల్ కు చేరిందనేది దృష్టిలో పెట్టుకుని 10 టీంలను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. 

ఏ టీం ఏ గ్రూప్ లో ఉందంటే?

గ్రూప్ ఏలో 

ముంబై ఇండియన్స్
కోల్ కతా నైట్ రైడర్స్
రాజస్థాన్ రాయల్స్
ఢిల్లీ క్యాపిటల్స్
లఖ్ నవూ సూపర్ జెయింట్స్

గ్రూప్ బిలో

చెన్సై సూపర్ కింగ్స్
సన్ రైజర్స్ హైదరాబాద్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పంజాబ్ కింగ్స్
గుజరాత్ టైటాన్స్