ఐపీఎల్‌‌‌‌ మెగా ఆక్షన్‌‌ మరింత ఆలస్యం!

ఐపీఎల్‌‌‌‌ మెగా ఆక్షన్‌‌ మరింత ఆలస్యం!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ మెగా ఆక్షన్‌‌ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్‌‌ ప్రకారం జనవరి ఫస్ట్‌‌ వీక్‌‌లో ఆక్షన్‌‌ జరగాల్సి ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోర్త్‌‌ వీక్‌‌లోనూ ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. లీగ్‌‌లోకి కొత్తగా వచ్చిన అహ్మదాబాద్‌‌ ఫ్రాంచైజీ ఇష్యూస్‌‌ ఇంకా ఫైనలైజ్‌‌ కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘అహ్మదాబాద్‌‌ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న సీవీసీ ఓనర్‌‌షిప్‌‌ అంశాన్ని తేల్చేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్‌‌ కమిటీ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఇది తేలే వరకు మెగా ఆక్షన్‌‌ డేట్స్‌‌ ఫైనలైజ్‌‌ అయ్యే చాన్స్‌‌ లేదు. ఇక ముగ్గురు ప్లేయర్లతో కాంట్రాక్ట్‌‌ చేసుకునేందుకు అహ్మదాబాద్‌‌, లక్నో ఫ్రాంచైజీలకు మరింత టైమ్‌‌ ఇవ్వాల్సి ఉంటుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నాడు.