IPL 2023 : ఐపీఎల్2023 మరింత జోరు.. కామెంటేటర్గా బాలయ్య

IPL 2023 : ఐపీఎల్2023 మరింత జోరు.. కామెంటేటర్గా బాలయ్య

నందమూరి బాలకృష్ణకు నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ప్రస్తుతం టాక్ షో హోస్ట్ గా మంచి గుర్తింపు ఉంది. తనకున్న క్రేజ్ తో  కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. అటు వెండి తెరని, ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్ లను షేక్ చేశాడు. ఇప్పుడు తన ఫ్యాన్స్ కు మరొక గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2023లో మరింత మజా అందించడంకోసం బాలయ్య సిద్ధం అయ్యాడు. 

కామెంటేటర్ గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. దీనికి సంబంధించిన వార్తను స్టార్ స్పోర్ట్స్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 31నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ ఓపెనింగ్ డే రోజు ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉండబోతుందని స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. 

‘ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్..
ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు.
తెలుగుజాతి గర్వపడేలా.. సంబరాన్ని అంబరాన్ని అంటేలా..
ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది.
మరి మిస్ అవ్వకుండా చూడండి’ అంటూ ట్వీట్ చేసింది.