IPL 2027: ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన.. హార్దిక్, సూర్య సహా ఆ 5 గురికి గుడ్‌బై?

IPL 2027: ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన.. హార్దిక్, సూర్య సహా ఆ 5 గురికి గుడ్‌బై?

IPL 2027: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) 2026 సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినప్పటికీ, 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి, 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. స్టార్ ప్లేయర్స్ తో కూడిన టీమ్ ఉన్నప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్లో ఘోర వైఫల్యం ముంబై పతనాన్ని శాసించింది. ఈ క్రమంలో ఈ ఏడాది నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ తొలి వారంలో జరగనున్న ఐపీఎల్ 2027 వేలానికి ముందే జట్టులో భారీ ప్రక్షాళన చేసేందుకు ముంబై యాజమాన్యం శ్రీకారం చుట్టింది. 

ముంబై గుడ్‌బై చెప్పే ఐదుగురు ప్లేయర్స్ వీళ్లే: 

హార్దిక్ పాండ్యా: 
ఐపీఎల్ 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు పేలవ ప్రదర్శనకు సారథిగా బాధ్యత వహిస్తూ జట్టును వీడేందుకు హార్దిక్ (Hardik Pandya) సిద్ధమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో మానసిక ప్రశాంతత కొరవడిందని భావిస్తున్న అతను ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలిపినట్లు తెలుస్తుంది. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడం ఫ్యాన్స్, సీనియర్ ఆటగాళ్లకు నచ్చకపోవడం, వరుసగా 2024, 2026 సీజన్లలో దారుణ వైఫల్యం మూలంగా అతని నిష్క్రమణ దాదాపు ఖారారు అయింది. 

* సూర్యకుమార్ యాదవ్: 
రూ. 16.35 కోట్లు పెట్టి మరీ సూర్యకుమార్ యాదవ్ ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. కానీ గత ఏడాదిన్నరగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్య (Suryakumar Yadav), 2026 సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 17.33 సగటుతో కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. మిడిలార్డర్‌లో అతను వైఫల్యం చెందడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఫామ్ అందుకోకపోతే సూర్యను కూడా వేలంలోకి వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ALSO READ : భారత్‌ను ఓడించేందుకే 2027 వరల్డ్‌కప్ ప్లాన్‌లకు బ్రేక్.. ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్!

* ట్రెంట్ బౌల్ట్: 
రూ. 12.50 కోట్లు పెట్టి మరీ భారీ ధరకు ట్రెంట్ బోల్డ్ ని కొనుగోలు చేసినప్పటికీ, 5 మ్యాచ్‌ల్లో 11.63 ఎకానమీతో కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు. బౌల్ట్ ఫ్లాప్ అవ్వడం జస్‌ప్రీత్ బుమ్రాపై కూడా అదనంగా ఒత్తిడి పెంచింది. దీంతో అతడిని విడుదల చేయడానికి ముంబై ఇండియన్స్ యాజమాన్యం సిద్ధమైంది.

* మయాంక్ మార్కండే:  
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో లభించిన 3 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు మయాంక్ మార్కండే (Mayank Markande). ఇతని స్థానంలో కొత్త స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను వేలంలో దక్కించుకోవాలని ముంబై యాజమాన్యం చూస్తుంది. 

* దీపక్ చాహర్:
రూ. 9.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి దీపక్ చాహర్ (Deepak Chahar)ని సొంతం చేసుకున్న ముంబై.. జట్టులోకి వచ్చిన తర్వాత పెద్దగా రాణించలేదు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 8 వికెట్లు మాత్రమే తీసి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. జట్టులో శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉండటంతో భారీ ధరకు కొనుగోలు చేసిన దీపక్ చాహర్‌ను వదిలేయడమే ఉత్తమమని ముంబై ఫిక్స్ అయింది.