అమెరికా ఏజెంట్​ను ఉరితీసిన ఇరాన్

అమెరికా ఏజెంట్​ను ఉరితీసిన ఇరాన్

టెహ్రాన్: ఢిఫెన్స్​కాంట్రాక్టర్ ముసుగులో గూఢచర్యం చేస్తున్న అమెరికన్​ఏజెంట్ జలాల్​హాజి జవార్​కు ఇరాన్​మరణశిక్ష విధించింది. మిలిటరీ కోర్టులో నిందితుడు తప్పును ఒప్పుకోవడంతో శిక్ష విధించి, అమలు చేసింది. ఈమేరకు సెమీ అఫీషియల్​న్యూస్​ఏజెన్సీ ఐఎస్ఎన్ఏ శనివారం వెల్లడించింది. అమెరికన్​గూఢచర్య సంస్థ సీఐఏ ఆఫర్​చేసిన డబ్బుకు లొంగి ఇరాన్ సైనిక రహస్యాలను జవార్​అమెరికాకు చేరవేశాడని తెలిపింది. జవార్​మాజీ భార్య కూడా ఇదే కేసులో పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తోందని పేర్కొంది. అయితే, జవార్​ను ఎప్పుడు అరెస్టు చేశారు, విచారణ ఎన్నడు జరిగింది, శిక్ష ఎక్కడ అమలు చేశారనే వివరాలను సైన్యం వెల్లడించలేదని ఐఎస్ఎన్ఏ పేర్కొంది. దేశంలో అమెరికా గూఢచర్య నెట్​వర్క్​ను నాశనం చేశామని ఇరాన్​ప్రకటించిన మరుసటి రోజే జవార్​మరణశిక్ష విషయం బయటికి పొక్కడం గమనార్హం.