కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ మంగళపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించారు. వానాకాలానికి ముందు రిజర్వాయర్‌కు చేయాల్సిన మైనర్ రిపేర్లు, రిజర్వాయర్ ప్రొటెక్షన్ గురించి ఆరా తీశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్ఎస్పీ ఆయకట్టు 2లక్షల 54వేల 270 ఎకరాలు, ఐడీఎస్ కింద 42 వేలు, మైనర్ ఇరిగేషన్‌కింద లక్ష ఎకరాలు ఇలా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగుకు నీరందుతుందన్నారు. మధిర నియోజకవర్గంలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. జిల్లాలో 300 చెరువులను నీటితో నింపామన్నారు. పాలేరులో పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో ఐబీ ఈఈ రమేశ్‌రెడ్డి, డీఈ శ్రీనివాస్, ఏఈలు ఉన్నారు

