V6 News

ఆస్పత్రి నుంచి ఇషాన్ కిషన్ డిశ్చార్జ్

ఆస్పత్రి నుంచి ఇషాన్ కిషన్ డిశ్చార్జ్

టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితిని BCCI మెడికల్ టీం పరిశీలిస్తోంది. ఈ రాత్రి జరిగే మూడో టీ20 నుంచి అతనికి విశ్రాంతి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ .. శ్రీలంక 2వ టీ20 మ్యాచ్‌లో ఇషాన్ తలకు దెబ్బ తగిలింది. ధర్మశాలలో శనివారం జరిగిన మ్యాచ్ లో అతడి తలకు గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో జట్టు వైద్య సిబ్బంది సలహా మేరకు ఇషాన్ కిషన్ ముందుజాగ్రత్తగా CT స్కాన్ చేయించుకున్నాడు. కాంగ్రాలోని ఒక ఆసుపత్రిలో అబ్జర్వేషన్ తర్వాత అతను డిశ్చార్జ్ అయ్యాడు.

భారత్ టార్గెట్ ఛేజింగ్‌లో నాలుగో ఓవర్‌లో లహిరు కుమార వేసిన పదునైన బౌన్సర్‌తో కిషన్‌ తలకు దెబ్బ తగిలింది. దీంతో శ్రీలంక ఫీల్డర్లు అతని చుట్టూ గుమిగూడారు. అయితే కిషన్ ఇవాళ జరగనున్న మ్యాచ్‌కు దూరమైతే.. అతని స్థానంలో వీకెట్ కీపింగ్ కోసం సంజు శాంసన్‌ను .. బ్యాటింగ్ కోసం మయాంక్ అగర్వాల్‌ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. 

అలాగే శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్ మ్యాన్ దినేష్ చండిమల్ ఫీల్డింగ్ చేస్తుండగా అతడి వేలికి గాయం అయింది. అతడిని కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ధర్మశాలలో జరిగిన  టీమిండియా, శ్రీలంక రెండవ టీ ట్వంటీ  మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఇవి కూడా చదవండి: 

కెప్టెన్ గా టీ20ల్లో రోహిత్ నయా రికార్డ్

ఖాకీ చొక్కా, ఖాకీ ప్యాంట్.. ధోని న్యూలుక్ అదిరింది