ఫస్ట్ వన్డేలో ఇషాన్ కిషన్ ప్రాంక్.. పిల్ల చేష్టలేంది అంటూ ఫైర్

ఫస్ట్ వన్డేలో ఇషాన్ కిషన్ ప్రాంక్.. పిల్ల చేష్టలేంది అంటూ ఫైర్

టీమిండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫస్ట్ వన్డేలో  వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేసిన ప్రాంక్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కుల్దీప్ వేసిన 16వ ఓవర్లో ఇషాన్  ప్రాంక్ చేశాడు. హెన్రీ నికోల్స్ ఔటైన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్  టామ్ లాథమ్ బ్యాటింగ్కు దిగాడు. కుల్దీప్ వేసిన బంతిని టామ్ లాథమ్ బ్యాక్‌ఫుట్‌లో డిఫెన్స్ చేశాడు. ఈ సమయంలో ఇషాన్ కిషన్ బెయిల్స్ పడేశాడు. రెప్పపాటులో బెయిల్ను కిందపడేసి ఏమీ తెలియనట్లు  ఔట్ కోసం అప్పీల్ చేశాడు. దీంతో టామ్ లాథమ్ సైతం హిట్ వికెట్ అయ్యానా.. అని ఒకింత ఆందోళనకు గురయ్యాడు. అటు భారత ఆటగాళ్లు సైతం ఇషాన్ కిషన్ కు తోడుగా గట్టిగానే అప్పీల్ చేశాడు. ఆ తర్వాత  బెయిల్ కింద పడటానికి కారణం ఇషాన్ కిషనే కారణమని తెలిసి భారత ఆటగాళ్లు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

దెబ్బకు దెబ్బ..

అంతకుముందు టీమిండియా  ఇన్నింగ్స్‌లో థార్డ్ అంపైర్ తప్పిదం వల్ల  హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. డేరిల్‌ మిచెల్‌ వేసిన 40వ ఓవర్‌లో నాలుగో బంతిని హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్నాడు. అయితే బంతి బ్యాట్‌ను తాకకుండా కీపర్ టామ్ లాథమ్ చేతిలో పడింది.  బెయిల్స్ కిందపడటంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో ఫీల్డ్ అంపైర్ థార్డ్ అంపైర్ రివ్యూ కోరాడు. థార్డ్ అంపైర్ పరిశీలించి ఔటిచ్చాడు. నిజానికి బంతి బెయిల్ను తాకలేదు. బంతిని అందుకునే క్రమంలో టామ్ లాథమ్ గ్లవ్స్ తాకి బెయిల్ కిందపడినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అయినా థార్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఇషాన్ కిషన్.... టామ్ లాథమ్ తరహాలోనే కీపింగ్ గ్లవ్స్‌తో బెయిల్స్‌ను పడేసి ఔట్ కోసం అప్పీల్ చేశాడు. కానీ రీప్లేలో ఇషాన్ గ్లవ్స్ తాకినట్లు తేలడంతో అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. 

 పిల్ల చేష్టలా...?

మరోవైపు ఇషాన్ కిషన్ చేసిన పనిని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తప్పు పట్టాడు. ఇంటర్నేషనల్ మ్యాచుల్లో పిల్ల చేష్టలు ఏంటని మండిపడ్డాడు. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ మాత్రం  ఇషాన్ కిషన్‌ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మోసానికి మోసం చేశాడని అభిప్రాయపడుతున్నారు. 

 

మరిన్ని వార్తలు