లెబనాన్‌‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు..హెజ్బొల్లా సాయుధ స్థావరాలను టార్గెట్

లెబనాన్‌‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు..హెజ్బొల్లా సాయుధ స్థావరాలను టార్గెట్

బీరుట్: లెబనాన్‌‌లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం మరోసారి భీకర దాడులు చేసింది. హెజ్బొల్లా సాయుధ గ్రూపునకు చెందిన దాదాపు 120 స్థావరాలను టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. గత 24 గంటల్లో జరిగిన దాడుల్లో 41 మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. దక్షిణ లెబనాన్‌‌లోని అరబ్‌‌ సలీమ్, స్రిఫా వంటి గ్రామాల్లో పౌరులతోపాటు సహాయక సిబ్బంది గాయపడ్డారని పేర్కొంది. 

దక్షిణ లెబనాన్‌‌లో పది గ్రామాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. కాగా, ఏప్రిల్ 17న కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ ఇరుపక్షాల మధ్య దాడులు ఆగడంలేదు. హెజ్బొల్లా డ్రోన్ దాడులకు తాము ప్రతిదాడులు  చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. గత మార్చి 2న ఇరాన్‌‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల అనంతరం హెజ్బొల్లా ప్రతీకార దాడులు ప్రారంభించింది. 

అప్పటినుంచి ఇజ్రాయెల్ లెబనాన్‌‌పై ాడులను తీవ్రతరం చేసింది. ప్రస్తుతం యూఎన్ ఆధ్వర్యంలో కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.