మాదాపూర్, వెలుగు : ఐటీ కారిడార్పరిధిలో బుధవారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం వరకు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. దీంతో శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఐటీ కారిడార్రోడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
బుధవారం ఉద్యోగులంతా ఆఫీసులకు వచ్చారు. ఇండ్లకు వెళ్లే టైంలో ఐకియా నుంచి సైబర్టవర్స్మీదుగా జేఎన్టీయూ రూట్లో ట్రాఫిక్ జామ్ఏర్పడింది. వెహికల్స్నెమ్మదిగా కదిలాయి. ఖాజగూడ నుంచి షేక్‌పేట, కొండాపూర్నుంచి హఫీజ్‌పేట రూట్, గచ్చిబౌలి–లింగంపల్లి రూట్లలో ట్రాఫిక్స్తంభించింది.