గచ్చిబౌలి, వెలుగు: సాఫ్ట్వేర్జాబ్చేస్తున్న ఓ యువకుడు డబ్బులపై ఆశతో గంజాయి దందా మొదలుపెట్టాడు. ఓ కస్టమర్‌కు అమ్ముతూ రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కాడు. ఐటీ కారిడార్నానక్రాంగూడ హనుమాన్ ఆలయం వద్ద ఇద్దరు గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో శేరిలింగంపల్లి జోన్ఎస్ఓటీ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో సాఫ్ట్వేర్ఉద్యోగి ప్రేమానంద్మాలిక్(24), క్యాబ్ డ్రైవర్ విశాల్(26) ను అదుపులోకి తీసుకొని చెక్ చేయగా మూడు కవర్లలో ప్యాక్చేసిన 2.592 కిలోల గంజాయి దొరికింది. వీరు ఒడిశాకు చెందిన రాఘవేంద్ర నుంచి గంజాయి కొని ఐటీ కారిడార్‌లో అమ్మేందుకు ప్లాన్‌వేశారు. మరో ఇద్దరు నిందితులు రాఘవేంద్ర, అకాష్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

