జనవరి నుంచి సినిమా షూటింగ్

జనవరి నుంచి సినిమా షూటింగ్

మరో ఇరవై రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. కొత్త పనులు, కొత్త నిర్ణయాలతో ఆ సంవత్సరాన్ని ఆహ్వానించాలనుకుంటాం. ఈ విషయంలో మహేష్‌‌‌‌‌‌‌‌ బాబు పక్కా ప్లానింగ్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించనున్న సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌ను జనవరి నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు కన్‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేశారు.  ‘ఆల్ సెట్‌‌‌‌‌‌‌‌ టు షూట్.  గ్రేట్ ఎనర్జీతో మహేష్‌‌‌‌‌‌‌‌ 28వ సినిమాని జనవరి నుంచి నాన్‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌గా సెట్స్‌‌‌‌‌‌‌‌కి తీసుకెళ్తున్నాం. మరిన్ని అప్‌‌‌‌‌‌‌‌డేట్స్‌‌‌‌‌‌‌‌తో మీ ముందుకు వస్తాం’ అంటూ టీమ్ అంతా కలిసున్న ఫొటోను హారిక అండ్ హాసిని సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  అసలు డిసెంబర్ సెకెండ్ వీక్‌‌‌‌‌‌‌‌ నుంచే షూటింగ్  మొదలుపెట్టాలను కున్నారు.

అయితే మ్యూజిక్ వర్క్‌‌‌‌‌‌‌‌తో పాటు నెలాఖరున మహేష్‌‌‌‌‌‌‌‌ లండన్ ట్రిప్‌‌‌‌‌‌‌‌ ఉండడంతో జనవరి నుంచి రెగ్యులర్ షూట్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో పాపులర్ బాలీవుడ్ నటుడు కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. షూటింగ్ ఆలస్యమవడంతో  ఆ డేట్‌‌‌‌‌‌‌‌కి వస్తుందా రాదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.