- ఎమ్మెల్యే దానం నాగేందర్ హితవు
సైఫాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్న కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన దేశానికే ఆదర్శంగా ఉందని, ఇక్కడి పథకాలనే మోదీ, అమిత్ షాలు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కవిత తన సొంత తండ్రిని రోబోగా అభివర్ణించడం సరికాదని, తల్లిదండ్రులను గౌరవించాలని హితవు పలికారు. మంగళవారం ఆదర్మ్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ప్రతి నియోజకవర్గానికి త్వరలో వెయ్యి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు
తెలిపారు.

