హైదరాబాద్లో ఐటీ సోదాలు

హైదరాబాద్లో ఐటీ సోదాలు

హైదరాబాద్లోని పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాలానగర్లోని రెండు కెమికల్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. ఆరు బృందాలుగా ఏర్పడిన అధికారులు వీర్ కెమికల్ అండ్ ఆరోమాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు చేపట్టారు. 

ఐటీ అధికారులు ఇటీవలే గచ్చిబౌలిలోని ఎక్సెల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు సంబంధించి 40 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లతో పాటు గచ్చిబౌలి లోని కార్పొరేట్ ఆఫీస్, మాదాపూర్, బాచుపల్లిలోని కార్యాలయాల్లో సోదాలు చేశారు. రబ్బర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ లో భారీగా తేడాలతో పాటు, ట్యాక్స్ చెల్లింపులో అవకతవకలపై అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.