దరిద్రాలన్నీ ఏకమై దాడి చేసినా దృఢంగా నిలబడతాం: కొండా మురళి సంచలన ట్వీట్ 

దరిద్రాలన్నీ ఏకమై దాడి చేసినా దృఢంగా నిలబడతాం: కొండా మురళి సంచలన ట్వీట్ 

కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. కొండా సురేఖ బర్తరఫ్ కు గవర్నర్ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో సురేఖ భర్త కొండా మురళి ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. అన్ని దరిద్రాలు ఏకమై మా మీద చేస్తున్నా, చేసిన రాజకీయ దాడులకు దృఢంగా నిలబడతామని.. మొండిగా ఎదురెళ్లగలమని ట్వీట్ చేశారు కొండా మురళి. ఈ ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

మాకు ఇదేం కొత్త కాదని.. ఇవాళ మేము.. రేపు ఎవరో? అంటూ మరో ట్వీట్ చేశారు కొండా మురళి. పదవులు ఉన్నా లేకున్నా తమ గౌరవం తమకు ఉంటుందని... తాము ప్రతిదానికి స్పందించకపోవచ్చు కానీ అన్నీ గమనిస్తూనే ఉంటామని... ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరని అన్నారు కొండా మురళి.

ఇదిలా ఉండగా..హైదరాబాద్ లోక్భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు పలువురు క్యాబినెట్ మంత్రులు కూడా లోక్ భవన్ కు వెళ్లారు. కొండా సురేఖ బర్తరఫ్, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలు గవర్నర్ కు వివరించారు సీఎం రేవంత్. ఈ క్రమంలో కొండా సురేఖ బర్తరఫ్ కు ఆమోదం తెలిపారు గవర్నర్ శుక్లా. 

►ALSO READ | కొండా సురేఖ బర్తరఫ్కు తెలంగాణ గవర్నర్ ఆమోదం.. సీఎం ఎదుటే సంతకం !