బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ఇళ్లలో ఐటీ సోదాలు

బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్  ఇళ్లలో ఐటీ సోదాలు

బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ఇండ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని వినోద్ ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే వచ్చిన అధికారులు... వినోద్ ఇంట్లో  పలు ఫైళ్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్ గా ఐటీ సోదాలు చేయడం చర్చనీయాంశమైంది.  ఐటీ దాడులకు నిరసనగా బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.  

మరవైపు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ ఇంటితో పాటు, హైదరాబాద్ లోని సోమాజిగూడలోని నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఐదున్నర నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంచిర్యాలలో  వివేక్ అనుచరుల ఇళ్లలనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వివేక్ ఇంటి దగ్గర మంచిర్యాల జిల్లా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.