తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడురోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు,మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు అలర్ట్ గా ఉండాలని..లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇవాళ  హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి..వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.