అటవీ ఉత్పత్తులు దళారులకు చేరొద్దు : ఐటీడీఏ పీవో బి.రాహుల్

అటవీ ఉత్పత్తులు దళారులకు చేరొద్దు : ఐటీడీఏ పీవో బి.రాహుల్

భద్రాచలం, వెలుగు : ఏజెన్సీలో ఆదివాసీలు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు దళారులకు చేరితే జీసీసీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ హెచ్చరించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయన జీసీసీ మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీ రైతులు పండించే ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు దారి మళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు భద్రాచలంలో భద్రగిరి మార్ట్​ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మినుములు, పెసలు, కందులు, జొన్నలు, మక్కలు, సజ్జలు, అడవుల్లో దొరికే ఏలూరు గడ్డలు, బొద్దుకూర, పుట్టగొడుగులు, ఇప్ప పువ్వులు, అవిసె గింజలు, కరక్కాయలు, చింతపండు నేరుగా ఆదివాసీలు గిరిమార్టులో అమ్ముకునేలా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. వారికి గిట్టుబాటు ధరను కల్పిస్తామన్నారు.