ఢిల్లీ ఎండల దెబ్బకు మార్కో రూబియో షాక్.. ప్రెస్ కాన్ఫరెన్స్ వాయిదా!

ఢిల్లీ ఎండల దెబ్బకు మార్కో రూబియో షాక్.. ప్రెస్ కాన్ఫరెన్స్ వాయిదా!

దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మండుతున్న ఎండలకు బెంబేలెత్తిపోయారు. ఎండవేడిమి తట్టుకోలేక ప్రెస్ కాన్ఫరెన్స్ తక్కువ టైంలో ముగించారు. ఢిల్లీలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్న క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం(మే23) కొత్త యూఎస్ ఎంబసీ సపోర్ట్ అనెక్స్ భవనాన్ని ప్రారంభించిన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించారు. తీవ్రమైన వేడిపై చమత్కరించారు.

ఈ రోజు ఇక్కడ ఉండటం గౌరవంగా ఉంది..వేడిగా ఉన్నందున నేను ఈ పత్రికా సమావేశాన్ని క్లుప్తంగా ముగించాలనుకున్నాను..సాధారణ వేడికి, ఈ వేడికి తేడా ఉంది. ఇప్పటికి చల్లబడాలి. మిమ్మల్ని ఇక్కడ ఎక్కువ సేపు ఉంచాలని నేను అనుకోవడం లేదు" అని రూబియో తన ప్రసంగాన్ని ముగించారు.

భారత్, అమెరికా మధ్య సంబంధాలు రోజురోజుకు బలపడుతున్నాయి. అమెరికాలో 20 బిలియన్ డాలర్లకుపైగా  భారత్ పెట్టుబడులు పెట్టింది. ఇండో పసిఫిక్ సైనిక విన్యాసాలు, వాణిజ్యం, భద్రతా సహకారం ద్వారా రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడుతుందని రూబియో అన్నారు. 

►ALSO READ | ఆవును జాతీయ జంతువుగా ప్రకటించండి: ముస్లిం మత పెద్ద డిమాండ్

ప్రధానిమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య చిరకాల సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు రూబియో. అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా ఉందని అన్నారాయన. నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చిన రూబియో, శనివారం ఉదయం కోల్‌కతాలో, ఆ తర్వాత ఢిల్లీలో పర్యటించారు. అనంతరం ప్రధాని మోదీతో చర్చలు జరిపారు.