
ధన్య బాలకృష్ణ, తేజ ఐనంపూడి, చైతన్య రావ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జగమే మాయ’. ఇన్స్టంట్ కర్మ అనేది ట్యాగ్ లైన్. ఉదయ్ కిరణ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే నిర్మించారు. సునీల్ పుప్పాల డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ డ్రామా డిసెంబర్ 15 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో ధన్య మాట్లాడుతూ ‘కాన్సెప్ట్ ఇంటరెస్టింగ్‌గా ఉంది. అందరిలోనూ గ్రే షేడ్స్ ఉంటాయని చెప్పే కథ ఇది. ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ చేశా’ అని చెప్పింది.
‘ఒకరికి చెడు చేయాలని చూస్తే, ఆ చెడు మనకే జరుగుతుంది అని చెప్పే చిత్రమిది’ అన్నాడు తేజ ఐనంపూడి. ‘స్క్రిప్ట్‌ను నమ్మి సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు దర్శకుడు. ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటుంది అన్నారు నిర్మాతలు. మేకా రామకృష్ణ, బీహెచ్ఈఎల్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, సుజన కందుకూరి, జ్యోతి, కేశవ్ దీపక్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.