ఉద్యమంలో చనిపోయింది విద్యార్థులే కేసీఆర్ కుటుంబం నుంచి ..ఎవరూ బలిదానం చేసుకోలే: జగ్గారెడ్డి 

ఉద్యమంలో చనిపోయింది విద్యార్థులే కేసీఆర్ కుటుంబం నుంచి ..ఎవరూ బలిదానం చేసుకోలే: జగ్గారెడ్డి 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే చనిపోయారని, కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరైనా ఆత్మబలిదానం చేసుకున్నారా అని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రజలు ఉద్యమం చేసి తెలంగాణ సాధిస్తే.. దాన్ని కేసీఆర్ తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

అధికారంపోగానే చెరువు నుంచి ఒడ్డుకు పడ్డ చేపలు ఎలా అయితే గిలగిల కొట్టుకుంటాయో.. కేసీఆర్, ఆయన కుటుంబం పరిస్థితి ఇప్పుడు అలానే ఉందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ కుటుంబం ఇచ్చిన తెలంగాణతోనే కేసీఆర్ సీఎం అయిన విషయాన్ని ఆయన కొడుకు కేటీఆర్ మరిచిపోరాదన్నారు. రాహుల్ విషయంలో, కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మాట్లాడే భాష సరిగ్గా లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాహుల్ విషయంలో, కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే భాషను కేటీఆర్ మార్చుకోవాలని, లేకపోతే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.