జగిత్యాల జిల్లాలో వరి కొయ్యలను తగలబెడితే జరిమానా : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల జిల్లాలో వరి కొయ్యలను తగలబెడితే జరిమానా : కలెక్టర్ సత్యప్రసాద్
  •  జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో రైతులు పంట అవశేషాలను, వరి కొయ్యలను కాల్చవద్దని, అలా చేస్తేవారికి జరిమానా విధిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. వరి కొయ్యల దహనం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూమిలోని సేంద్రియ కార్బన్, వానపాములు నశించి భూసారం తగ్గుతుందన్నారు.

అంతేకాకుండా మంటలు అదుపు తప్పి సమీపంలోని ఆయిల్ పామ్, మామిడి తోటలకు వ్యాపించి రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట అవశేషాలను తగలబెడితే రూ.5,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.