ప్రభుత్వంపై భారం పడుతున్నా వెనుకడుగు వేస్తలేం :   జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ప్రభుత్వంపై భారం పడుతున్నా వెనుకడుగు వేస్తలేం :   జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

 

  • గృహజ్యోతితోపాటు అన్ని పథకాలు అమలు చేస్తున్నాం

రాయికల్​, వెలుగు: రూ.30 లక్షలతో ఏర్పాటు చేస్తున్న నాలుగు డీటీఆర్‌‌‌‌(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు)లతో లోఓల్టేజీ సమస్య పరిష్కారమవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్ ​కుమార్​అన్నారు. రాయికల్ ​పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు ట్రాన్స్​ఫార్మర్లను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ వల్ల ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ చెల్లించిన వారికి కరెంట్ లైన్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

మైతాపూర్–రామాజీపేట బ్రిడ్జి పనులు పూర్తి చేశామని, మిగిలిన అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తిచేస్తామన్నారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయికల్‌‌‌‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్​కె.గంగారెడ్డి, సింగిల్​ విండో చైర్మన్​ ఎ.మల్లారెడ్డి, పార్టీ నాయకులు శేఖర్ ​రెడ్డి, మచ్చ శేఖర్, తిరుపతి గౌడ్, ఎంపీడీవో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.