
హైదరాబాద్, వెలుగు: బీసీల విషయంలో కాంగ్రెస్ రాజకీయ పాలసీ ఏంటో ఖమ్మంలో నిర్వహించే తెలంగాణ జన గర్జన సభలో ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కర్నాటకలాగానే బీసీలకు జనాభా ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, బీసీలకే సీఎం పదవి ఇస్తామని హామీ ఇవ్వాలన్నారు. శనివారం ఆయన రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. కర్నాటక ఫార్ములానే తెలంగాణలోనూ అమలు చేస్తామని ఖమ్మం సభలో రాహుల్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగైతేనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.