V6 News

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం స్పందించిన తీరు భేష్

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం స్పందించిన తీరు భేష్
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్  గౌడ్

నర్సంపేట, వెలుగు: ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు. నర్సంపేటలో పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న కోలా శంకర్  గౌడ్​ ఫొటోకు డిపో ఎదుట బీసీ సంక్షేమ సంఘం, ఆర్టీసీ జేఏసీ నాయకులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్​ గౌడ్​ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామమని చెప్పారు.

శంకర్​గౌడ్​ బలిదానం వల్లే ఆర్టీసీ సమ్మె విరమణ జరిగిందని, కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఆర్టీసీ ఉద్యమ చరిత్రలో శంకర్​గౌడ్​ త్యాగం వెలకట్టలేనిదని చెప్పారు. ఆయన​ఫ్యామిలీకి రూ.కోటి ఎక్స్​గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరంజన్, ప్రొఫెసర్​ సంఘని మల్లేశ్వర్, డ్యాగల శ్రీనివాస్​ ముదిరాజ్, బండి స్వామి, యాదగిరి, ఉపేందర్, శ్రీనివాస్, వేణు, రవి పాల్గొన్నారు.