నర్సంపేట, వెలుగు: రైతులు పండించిన మక్కజొన్నలను వేగంగా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశించారు. నర్సంపేటలోని క్యాంప్ ఆఫీసులో మొక్కజొన్న నిల్వలు, కొనుగోళ్లపై సోమవారం సమీక్ష జరిగింది. ముందుగా మార్కెట్ యార్డును వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సందర్శించారు. మక్కల నిల్వలు, కొనుగోళ్ల తీరు తెన్నులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన
సమావేశంలో వారు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. డీసీవో నీరజ, ఆర్డీవో ఉమారాణి, మార్కెటింగ్ డీఎం సురేఖ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

