‘పండోరా’ అందాలను అద్భుతంగా చూపించిన జేమ్స్ కామరూన్‌‌‌‌

‘పండోరా’ అందాలను అద్భుతంగా చూపించిన జేమ్స్ కామరూన్‌‌‌‌

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అవతార్‌‌2’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ పార్ట్‌‌‌‌లో ‘పండోరా’ అందాలను అద్భుతంగా చూపించిన జేమ్స్ కామరూన్‌‌‌‌.. సీక్వెల్‌‌‌‌గా వచ్చిన ‘ద వే ఆఫ్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌’లో నీటి అడుగున అందాలు, భారీ సముద్ర జీవులతో ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లారు. ఈసారి కథ కంటే కూడా విజువల్స్ పైనే కామరూన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. మూడు గంటలకు పైగా ఉన్న సినిమా కొంత సాగతీతగా అనిపించినా, సినిమాలోని సీన్స్ అన్నీ హైలైట్స్‌‌‌‌గా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదల చేశారు. సినిమాపై మిక్స్‌ డ్‌ రివ్యూస్ వచ్చాయి. ఇక మనదేశంలో ఇంగ్లీష్‌‌‌‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. నాలుగు వేలకు పైగా స్క్రీన్స్‌‌‌‌లో పదిహేడు వేలకు పైగా షోస్ వేశారు. 

అడ్వాన్సుడ్‌‌‌‌ బుకింగ్స్‌‌‌‌తోనే ఇరవై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇదే జోష్‌‌‌‌తో ఫస్ట్ డే ‘అవెంజర్స్ ఎండ్‌‌‌‌గేమ్‌‌‌‌’ (రూ.53.10 కోట్లు) కలెక్షన్స్‌ ను క్రాస్‌‌‌‌ చేస్తుందని అంతా భావించారు. కానీ రూ.41 కోట్లు రాబట్టి.. హలీవుడ్ సినిమాల ఇండియా వైడ్ ఫస్ట్‌‌‌‌ డే కలెక్షన్స్‌‌‌‌లో  నెంబర్‌‌‌‌‌‌‌‌ 2గా నిలిచింది. ఇందులోనూ సౌత్‌‌‌‌ స్టేట్స్‌‌‌‌ నుండే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు కోట్ల వరకూ గ్రాస్‌‌‌‌ రాబట్టింది. రొటీన్ స్టోరీ కావడం, సినిమా లెంగ్త్ ఎక్కువుందనే  విమర్శలు వచ్చినప్పటికీ.. థియేటర్స్‌‌‌‌లోనే చూసి ఎక్స్‌‌‌‌పీరియన్స్ చేయాల్సిన సినిమా కావడంతో.. ఫస్ట్ డే పైరసీ వెర్షన్ లీక్ అయినప్పటికీ థియేటర్స్ వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. వీకెండ్‌‌‌‌ తర్వాత కలెక్షన్స్‌‌‌‌ విషయంలో మరింత క్లారిటీ రానుంది.