జమ్మికుంట ఎఫ్‌‌సీఐకి జాతీయ అవార్డు

జమ్మికుంట ఎఫ్‌‌సీఐకి జాతీయ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: జమ్మికుంటలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌సీఐ) గిడ్డంగికి జాతీయ అవార్డు దక్కింది. ఆహార ధాన్యాల నిల్వలో ఉత్తమ పనితీరు చూపినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ అవార్డులను అందజేశారు.

జమ్మికుంట ఎఫ్‌‌సీఐ అధికారి ఈ అవార్డును స్వీకరించారు. దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు చూపిన 20 గిడ్డంగులకు ‘డిపో దర్పణ్’ ఫ్రేమ్‌‌వర్క్ కింద పురస్కారాలు ఇచ్చారు. ఇందులో జమ్మికుంట గిడ్డంగి ఎంపికైంది. ఈ కార్యక్రమంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఆధారిత స్మార్ట్ వేర్‌‌హౌసింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించారు.