తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలోని జనగాం గ్రామ రైతులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో సేకరించడం లేదని, లారీల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అధికారులు పట్టించుకోవడం లేదని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోయాడు. ధర్నాతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న ఎస్సై ప్రశాంత్ వర్ధన్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే రెండు లారీలను ఏర్పాటు చేయడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.
