3గంటల 'ఆర్ఆర్ఆర్'మూవీ స్టోరీ బుక్ గా.. కొడుకు కోసం తల్లి రూపకల్పన

3గంటల 'ఆర్ఆర్ఆర్'మూవీ స్టోరీ బుక్ గా.. కొడుకు కోసం తల్లి రూపకల్పన

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చెరగని ముద్ర వేసుకుని, ఇటీవలే ఆస్కార్ తో కాలర్ ఎగరేసిన ఆర్ఆర్ఆర్ విడుదలై మార్చి 25నాటికి ఏడాది పూర్తయింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ లో రూ.1200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ తల్లి తన కొడుకు కోసం ఆర్ఆర్ఆర్ మూవీలోని సీన్స్ ను గుర్తు చేసేలా ఇలస్ట్రేటెడ్ స్టోరీబుక్ ను తయారు చేసింది. 

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 'రోర్ బై ఆర్‌ఆర్‌ఆర్' పేరుతో ఒక పేజీ షేర్ చేసింది. ఈ వీడియోలో జపనీస్ లాంగ్వేజీలో స్టోరీ, దానికి సంబంధించిన సన్నివేశాలతో నటుల బొమ్మలు ప్రింట్ చేయబడి ఉన్నాయి. తన ఏడేళ్ల కొడుకు సబ్ టైటిల్స్ తో సినిమా చూడడం కష్టం కాబట్టి 3గంటల సినిమాను ఆ తల్లి ఈ బుక్ గా తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ పోస్ట్ కు ఆరు లక్షలకు పైగా వ్యూస్, 70,000 లైక్‌లు రాగా, ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ తో పాటు పలువురు భిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/reel/CnlTB7SLy_W/?img_index=1