ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల పరిశీలనను స్పీడప్‌‌‌‌ చేయాలి : అర్బన్ డెవలప్‌‌‌‌ మెంట్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్

 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల పరిశీలనను స్పీడప్‌‌‌‌ చేయాలి : అర్బన్ డెవలప్‌‌‌‌ మెంట్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ సుడా పరిధిలోని మాస్టర్ ప్లాన్ డెవలప్‌‌‌‌మెంట్ ప్రక్రియ,  ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను స్పీడప్‌‌‌‌ చేయాలని, నిబంధనల ప్రకారం భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ చీఫ్​ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. 

గురువారం సుడాలో అభివృద్ది పనుల పురోగతిపై హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌‌‌‌లో కలెక్టర్  చిత్రా మిశ్రా, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌‌‌‌తో ఆయన రివ్యూ చేశారు. సుడా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేయాలన్నారు.