- మోహిత్శేఖర్కు 4వ ర్యాంకు,
- కుచి సందీప్‌కు 5వ ర్యాంక్
- ఏపీకి చెందిన నాగ సహర్షకు 9వ ర్యాంక్
- దేశవ్యాప్తంగా 56,880 మంది క్వాలిఫై
- మద్రాస్ జోన్ నుంచి 14,294 మందికి అర్హత
- అడ్వాన్స్‌డ్ ఫలితాలు
- రిలీజ్ చేసిన ఐఐటీ రూర్కీ
- ఆల్ ఇండియా టాపర్‌గా శుభమ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్–2026 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 56,880 మంది క్వాలిఫై అయ్యారని ఐఐటీ రూర్కీ సోమవారం ప్రకటించింది. అయితే, ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకర్లలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండగా, వారిలో ఇద్దరు తెలంగాణ స్టూడెంట్లు కావడం విశేషం. హైదరాబాద్ కు చెందిన మోహిత్ శేఖర్ శుక్లా 4వ ర్యాంక్ సాధించగా, కుచి సందీప్ 5వ ర్యాంక్ పొందారు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన మేడిశెట్టి నాగ సహర్ష 9వ ర్యాంక్ సాధించారు. ప్రధానంగా ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి అత్యధికంగా 14,294 మంది విద్యార్థులు అర్హత సాధించి.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు.
56,880 మంది క్వాలిఫై..
మే నెలలో జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 1,87,389 మంది రిజిస్టర్ కాగా, రెండు పేపర్లకు కలిపి1,79,694 మంది విద్యార్థులు హాజరయ్యారు. దానిలో 56,880 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో 46,773 మంది బాలురు ఉండగా, 10,107 మంది బాలికలు ఉన్నారు. పీడబ్ల్యూడీ కేటగిరీలో 2,864 మంది పరీక్షకు అటెండ్ కాగా 887 మంది అర్హత సాధించారు. అయితే, ఇండియన్ నేషనాలిటీ కలిగిన విద్యార్థులు 1,78,944 మంది ఎగ్జామ్స్ రాయగా.. 56,625 మంది క్వాలిఫై అయ్యారు. కాగా, ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకున్నారు. బాలికల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కే చెందిన ఆరోహి దేశ్‌పాండే 280 మార్కులతో 77వ ర్యాంకుతో టాపర్‌గా నిలిచారు.
జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో ఐఐటీ మద్రాస్ జోన్ హవా కొనసాగింది. మద్రాస్ జోన్ నుంచి 14,294 మంది, ఐఐటీ బాంబే నుంచి 12,389 మంది, ఐఐటీ ఢిల్లీలో 10,697 మంది, ఐఐటీ రూర్కీ జోన్ నుంచి 5,637, ఐఐటీ కాన్పూర్ నుంచి 5,552, ఐఐటీ భువనేశ్వర్ జోన్ నుంచి 5,428 మంది, ఐఐటీ గౌహతీ జోన్ నుంచి 2,883 మంది క్వాలిఫై అయ్యారు. టాప్ 500 ర్యాంకుల్లో ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి అత్యధికంగా 174 మంది చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఐఐటీ బాంబే 120, ఐఐటీ ఢిల్లీ 114, ఐఐటీ రూర్కీ46 మందితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఓబీసీ నాన్‌క్రీమిలేయర్(ఎన్సీఎల్) పీడబ్ల్యూడీ కేటగిరిలో నాగచైతన్య టాపర్‌గా నిలిచారు.
నేటి నుంచి జోసా కౌన్సెలింగ్
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జోసా 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెలువడిడంతో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జూన్ 8, 10 తేదీల్లో మాక్ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 11 సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు గడువు ఇచ్చారు. మొత్తం ఐదు విడతల్లో సీట్లను కేటాయించనున్నారు. జూన్ 13న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 30న రెండో విడత, జులై 6న మూడో విడత, జులై 10న నాలుగో విడత సీట్లు కేటాయిస్తారు. ఐఐటీలకు జులై 16న జరిగే ఐదో విడతే ఆఖరిది. ఎన్‌ఐటీ+ సిస్టమ్ అభ్యర్థులు జులై 22 నుంచి 24 వరకు పాక్షిక అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు josaa.nic.in వెబ్‌సైట్ చూడొచ్చు.
నేటి నుంచి జోసా కౌన్సెలింగ్
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జోసా 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జూన్ 8, 10 తేదీల్లో మాక్ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 11 సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు గడువు ఇచ్చారు. మొత్తం ఐదు విడతల్లో సీట్లను కేటాయించనున్నారు. జూన్ 13న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 30న రెండో విడత, జులై 6న మూడో విడత, జులై 10న నాలుగో విడత సీట్లు కేటాయిస్తారు. ఐఐటీలకు జులై 16న జరిగే ఐదో విడతే ఆఖరిది. ఎన్‌ఐటీ+ సిస్టమ్ అభ్యర్థులు జూలై 22 నుంచి 24 వరకు పాక్షిక అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు josaa.nic.in వెబ్‌సైట్ చూడొచ్చు.
జాతీయ స్థాయి టాప్ 10 ర్యాంకర్లు
ర్యాంక్ పేరు మార్కులు జోన్
1 శుభమ్ కుమార్ 330 ఐఐటీ ఢిల్లీ
2 కబీర్ ఛిల్లర్ 329 ఐఐటీ ఢిల్లీ
3 జతిన్ చాహర్ 319 ఐఐటీ ఢిల్లీ
4 మోహిత్ శేఖర్ శుక్లా 319 ఐఐటీ మద్రాస్
5 కుచి సందీప్ 318 ఐఐటీ మద్రాస్
6 బి. జయకృష్ణ శ్రీనివాస్ 314 ఐఐటీ బాంబే
7 అర్ణవ్ గౌతమ్ 314 ఐఐటీ ఢిల్లీ
8 కనిష్క్ జైన్ 313 ఐఐటీ బాంబే
9 మేడిశెట్టి నాగ సహర్ష 312 ఐఐటీ మద్రాస్
10 దర్శ్ సిక్కా 311 ఐఐటీ ఢిల్లీ
అడ్వాన్స్‌డ్ కేటగిరీ వారీగా క్వాలిఫై డేటా
కేటగిరీ రిజిస్టర్ అటెండ్ క్వాలిఫై
జనరల్ 40,053 38,436 15,883
ఓబీసీ 70,432 67,539 12,385
ఈడబ్ల్యూఎస్ 30,155 29,359 6,377
ఎస్సీ 31,613 30,015 15,856
ఎస్టీ 15,136 14,345 6,379
మొత్తం 1,87,389 1,79,694 56,880
జెండర్ వైజ్ క్వాలిఫైడ్ డేటా
జెండర్ రిజిస్టర్ హాజరు క్వాలిఫైడ్
బాలురు 1,44,276 1,39,131 46,773
బాలికలు 43,112 40,562 10,107
థర్డ్ జెండర్ 1 1 0
మొత్తం 1,87,389 1,79,694 56,880
