మెక్సికో సిటీ : ఇండియా రేసర్ జెహాన్ దరువాలా ఫార్ములా–ఈ చాంపియన్‌షిప్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ఆదివారం జరిగే మెక్సికో సిటీ రేస్‌లో మసెరటి ఎమ్ఎస్జీ రేసింగ్ టీమ్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఎఫ్1 ఫీడర్ సిరీస్ ఫార్ములా 2 నుంచి ఎలక్ట్రిక్ రేసింగ్‌లోకి మారుతున్న 25 ఏండ్ల జెహాన్.. మాక్సిమిలియన్ గుంతర్తో కలిసి పోటీ పడనున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ హోదా లభించిన తర్వాత ఫార్ములా–ఈలో పోటీ పడే తొలి ఇండియన్ జెహాన్ కావడం విశేషం.
ఇకపై హైదరాబాద్‌లో నో రేస్
హైదరాబాద్‌లో రద్దయిన ఫార్ములా–ఈ రేస్ వచ్చే ఏడాది ఇండియాలో రీఎంట్రీ ఇవ్వనుంది. రేస్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇతర నగరాలతో త్వరలోనే సంప్రదింపులు జరుపుతామని ఫార్ములా–ఈ కో ఫౌండర్ ఆల్బర్టో లాంగో తెలిపారు. హైదరాబాద్‌లో క్యాన్సిల్ అయినప్పటికీ మెగా ఈవెంట్‌ను ఇండియాలో నిర్వహించేందుకు ఆసక్తిగానే ఉన్నట్టు స్పష్టం చేశారు.
అయితే, ఫ్యూచర్లో రేస్ నిర్వహణకు హైదరాబాద్‌ను మాత్రం పరిగణనలోకి తీసుకోబోమని లాంగో తెలిపారు. ఇతర నగరాల్లో రేస్‌ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఒక సిటీ ముందుకొచ్చిందని తెలిపారు.