ఈ ప్రపంచంలో ఏం జరుగుతోంది? అంటే చదువుకున్న వాళ్లకు బాగా తెలుసు! మనుషులు కులాల వారీగా, మతాల వారీగా, జాతుల వారీగా, పార్టీలవారీగా అంతస్తులవారీగా ముక్కలుగా విడిపోయారు. ఎన్నో గందరగోళాలతో నిండి ఉన్న సొసైటీలో మనం బతుకుతున్నాం. భాష, మతం, కల్చర్ను విభజించి మనుషులే ఈ సొసైటీని సృష్టించారు. మనుషులు సృష్టించిన ఈ కన్ఫ్యూజనే ప్రపంచ యుద్ధాలకు, రాజకీయ మోసాలకు కారణమవుతోంది. హింస, ద్వేషం తాలూకు విత్తనాలు నాటుతూ మనుషుల మధ్య శత్రుత్వాన్ని పెంచుతోంది.
ఇలాంటి గందరగోళ సమయంలో గురువుల బాధ్యత ఇంకా గొప్పగా ఉండాలి.. వాళ్ల బోధనలు సీరియస్ గా, కమిటెడ్ గా ఉండాలి. తమ శిష్యులను మానవత్వం నిండిన మనుషులుగా తయారు చేయాలి. జాతీయవాదం, ప్రాంతీయవాదం, మతం, కులం... ఇలాంటి భావాలు లేని మానవత్వం నిండిన మనుషుల్లా తీర్చిదిద్ది... గ్లోబల్ రిలేషన్షిప్ ఫీలింగ్ కలిగించాలి.
చదువు చెప్తుందా?
చదువేం చేస్తోంది? కేవలం ఉద్యోగం తాలూకు అర్హత సాధించేలా చేస్తుందా? లేక మనల్ని నిజమైన మనుషుల్లాగ తీర్చిదిద్దుతోందా? టీచర్ కేవలం పాఠాలు చెప్పడంతోనే ఆగిపోకూడదు. తన స్టూడెంట్కి నేచర్ తో సంబంధం కలిగి ఉండేలా ఎడ్యుకేట్ చేయాలి. ఈ ప్రపంచంలో చెట్లు, ఎడారులు, నదులు, జంతువులు ఇలా ఎన్నో ఉంటాయి.
అయితే, మనుషుల్లాగా జంతువులకు జాతీయవాదం లాంటి వాదాలేం ఉండవు. అవి కేవలం బతకడానికి మాత్రమే వేటాడుతుంటాయి. మరి మనిషి ప్రకృతి నియమాలకు విరుద్ధంగా బతుకుతున్నాడు. టీచర్, స్టూడెంట్ ఇద్దరూ ప్రకృతి సంబంధాల మీద కంట్రోల్ కోల్పోతే.. కచ్చితంగా మానవత్వంతోనూ సంబంధం కోల్పోతారు. మానవత్వం నశించడం వల్లే.. మనిషి ప్రకృతి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు.
ప్రకృతి అంటే..
జంతువుల్ని, పక్షుల్ని, చెట్లని కాపాడాలి.కలుషితం అయిన నదుల్ని క్లీన్ చేయాలి. ఇలా చాలా మంది ప్రకృతిని రక్షించాలని గొప్పగా మాట్లాడుతుంటారు. కానీ.. ప్రకృతిని నిర్వచించడం కష్టం. చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగు వరకు ప్రతి జీవి ఈ భూమ్మీద బతకడమే ప్రకృతి. నదులు అంటే కేవలం గంగా, థేమ్స్, మిస్సిసిపీ మాత్రమే కాదు. ప్రతి చిన్న నది. చెరువు. కొండలు, కోసలు అన్నీ ప్రకృతిలో భాగమే.
►ALSO READ | జ్యోతిష్యం : మే 15న వృషభంలోకి సూర్యుడు, బుధుడు.. ఈ 4 రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే..!
మనం చూడం
మనం ఎప్పుడూ మన సమస్యలు, కోరికలు, బాధలు వీటిని చూసుకుంటూనే బతుకుతాం తప్ప.. పక్కనేం ఉందో పట్టించుకోం. చందమామను కూడా సరిగ్గా చూడం! ఒకసారి చందమామని చూడండి. అన్ని ఇంద్రియాలతో చందమామను ఫీలవ్వండి. ఇప్పుడే మొదటిసారి చందమామను చూసినట్టు చూడండి. చెట్లని, గడ్డిని కూడా మొదటిసారి చూసినట్టు చూడండి. తర్వాత టీచర్ని, తల్లిని,
అందమైన ప్రపంచం
మనుషులు గ్రూపులుగా విడిపోకుండా కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే.. ఈ భూమి ఎంత అందమైందో తెలిసొస్తుంది. ఈ భూమ్మీద ఎంత ఆనందం నిండి ఉందో తెలుస్తుంది. పంచభూతాల్ని ఆస్వాదించగల కమ్యూనికేషన్ ప్రకృతితో కలిగి ఉన్నప్పుడు... ఇతరులతో రిలేషన్షిప్ కూడా చాలా సింపుల్ గా మారుతుంది. ప్రకృతితో మనిషి అంతర్ సంబంధం కలిగి ఉంటాడు. ప్రకృతి నుంచి దూరం జరిగి తప్పించుకోలేడు. ఎప్పుడైతే.. మనిషి ప్రకృతిని నాశనం చేస్తాడో.. అప్పుడు అతడ్ని అతని నాశనం చేసుకుంటుంటాడు. శత్రువు ఎవరో కాదు. నీకు నువ్వే, ఇది గుర్తించ గలిగితే.. మనిషి ప్రకృతిలో భాగమై ఆనందంగా జీవిస్తాడు.
తండ్రిని, తోబుట్టువుని కూడా రోజూ మొదటిసారి చూసినట్టు చూడండి. ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని ప్రేమించాలి. మనకు, ప్రకృతితో ఇలాంటి కమ్యూనికేషన్ ఏర్పడినప్పుడు.. ఏ మనిషితోనైనా.... కమ్యూనికేట్ కావొచ్చు. ఇంద్రియాలతో ఫీలవడమే తప్ప.. దానికి ఎలాంటి మాటలూ అక్కర్లేదు.
-జిడ్డు కృష్ణమూర్తి
