జ్యోతిష్యం : మే 15న వృషభంలోకి సూర్యుడు, బుధుడు.. ఈ 4 రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే..!

జ్యోతిష్యం : మే 15న వృషభంలోకి సూర్యుడు, బుధుడు.. ఈ 4 రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమే..!

ఎవరు అవునన్నా, కాదన్నా... గ్రహాల కలయిక, కదలిక మనిషిపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. గ్రహాలు కలిసొచ్చి అందలం ఎక్కినవారు, కలిసిరాక ఇబ్బంది పడుతున్నవారిని మన రోజూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... మే 15న గ్రహాల కలయిక ఎరపడుతోంది.. వృషభంలోకి సూర్యుడు, బుధుడు కలవనున్నారు. ఈ ప్రభావంతో 4 రాశుల జాతకం పూర్తిగా మారిపోబోతోంది.

హిందూ పంచాంగం ప్రకారం శుక్రవారం ( మే 15 ) సూర్యుడు,,బుధుడు వృషభరాశిలో కలవనున్నారు. ఈ కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. వృషభరాశి అధిపతి అయిన శుక్రుడు, సూర్య-బుధులతో మిత్రుడిగా ఉండటం వల్ల ఈ యోగం చాలా శక్తివంతంగా మారుతుంది.

ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే:

వృషభ రాశి: బుధాదిత్య యోగం వల్ల వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. నిర్ణయాలు కూడా సమర్థవంతంగా తీసుకుంటారు. 

సింహ రాశి: బుధాదిత్య యోగం ప్రభావంతో సింహరాశి వారి జీవితం అద్భుతంగా మారనుంది. వీరి జీవితంలో అద్భుతమైన పురోగతి మొదలవుతుంది. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ పొందే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

 

►ALSO READ | Best time: మెడిటేషన్.. వర్కవుట్స్ .. చేయాల్సిన టైం ఇదే.. అప్పుడే బెటర్ రిజల్ట్స్ వస్తాయి

 

కన్యా రాశి: బుధుడు కన్యా రాశి అధిపతి కావడం వల్ల ఈ రాశివారిని అదృష్టం వరించనుంది. విదేశీ విద్య, ఆధ్యాత్మిక పర్యటనలకు ఇది చాలా అనుకూల సమయం. బుధాదిత్య యోగం వాళ్ళ కన్యా రాశి వారి జీవితంలో చాలా అద్భుతాలు చోటు చేసుకోనున్నాయి.

వృశ్చిక రాశి: బుధాదిత్య యోగం వల్ల వృశ్చిక రాశి వారికీ వ్యాపారంలో భారీ లాభాలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో ఇబ్బంది ఎదుర్కుంటున్న వారికీ ఈ యోగం వల్ల సమస్యలన్నీ తీరనున్నాయి... ప్రశాంతత లభించనుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని సమాచారం పురాణాల ప్రకారం ఆధ్యాత్మిక నిపుణులు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.