Best time: మెడిటేషన్.. వర్కవుట్స్ .. చేయాల్సిన టైం ఇదే.. అప్పుడే బెటర్ రిజల్ట్స్ వస్తాయి

Best time: మెడిటేషన్.. వర్కవుట్స్ .. చేయాల్సిన టైం ఇదే.. అప్పుడే బెటర్ రిజల్ట్స్ వస్తాయి

ఏది ఎప్పుడు చేయాలో, అప్పుడు చేస్తేనే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా వర్కవుట్స్, మెడిటేషన్ వంటి విషయాల్లో వాటికంటూ ఒక టైం ఉంటుంది. వాటిని పక్కాగా ఫాలో అయితే పూర్తిస్థాయిలో ఫలితాలు ఈ ఉంటాయి. 

సూర్యోదయానికి రెండున్నర గంటలు. ముందు... మెడిటేషన్​ కు పర్ఫెక్ట్ టైమ్ అని ఎక్స్​ పర్ట్స్ చెప్తున్నారు. ఆ టైంలో సూర్యుడు భూమికి 60 డిగ్రీల కోణంలో ఉంటాడు. కాబట్టి అప్పుడు వెలువడే శక్తి మెడిటేషన్ కు అనుకూలంగా ఉంటుందనేది వాళ్ల అభిప్రాయం.

  • తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య టైమ్ ని మ్యాజిక్ అవర్స్ గా పరిగణిస్తారు. ఈ టైంలో మెడిటేషన్ చేస్తే, ఏ అంతరాయమూ లేకుండా నేరుగా యూనివర్స్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వొచ్చట.
  • మెడిటేషన్ కంటే ముందు వ్యాయామం చేయడం మంచిది. దాని వల్ల ఫిజికల్ గా, మెంటల్​ గా, ఎమోషనల్ గా బలం పెరుగుతుంది. వర్కవుట్స్ తర్వాత, పావుగంట మెడిటేషన్ చేయడం వల్ల మైండ్ ఫ్రెష్ అవుతుంది. బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది.
  • ప్రశాంతమైన ప్లేస్ ఎంచుకోవాలి. ఫోన్, గాడ్జెట్లను పక్కన పెట్టేయాలి. రోజూ ఒకే టైమ్ లో మెడిటేషన్ చేసుకునేలా, ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్ పోశ్చర్​ను  ఎంచుకున్నామో లేదో చెక్ చేసుకోవాలి. మొదట్లో కొంచెంసేపు చేసి, తర్వాత నెమ్మదిగా మెడిటేషన్ చేసే టైం పెంచాలి..
  • టైం కుదరడం లేదని, వర్కవుట్స్​ ను మెడిటేషన్​ స్కిప్ చేయొద్దు. వర్కవుట్స్, మెడిటేషన్ ఎప్పుడు చేసినా రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఈ పర్ఫెక్ట్ టైమ్​లో చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి..

►ALSO READ | Kitchen Telangana:  పైనాపిల్ తో విందు..  లస్సీ ..పాయసం.. సూపర్ టేస్ట్.. తింటే హాయిగా కూల్గా ఉంటుంది..!