జింఖానాలో వీధి బాలల క్రీడాపోటీలు..ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్

జింఖానాలో వీధి బాలల క్రీడాపోటీలు..ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: రెయిన్ బో హోమ్స్ ప్రోగ్రాం నెట్​వర్క్ ఆధ్వర్యంలో ఆదివారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్​లో నిర్వహించిన వీధి బాలలు, అనాథ బాలల క్రీడా పోటీలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న బాలలు మనోధైర్యం కోల్పోకుండా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వారికి అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలను అభినందిస్తూ, తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.