సీసీ టీవీ ఫుటేజ్ సర్వర్ డామేజ్.. మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్

సీసీ టీవీ ఫుటేజ్ సర్వర్ డామేజ్.. మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్

ఢిల్లీలోని జేఎన్‌యూ లో విద్యార్ధులు, అధ్యాపకులపై జరిగిన దాడి ఘటనకి సంబంధించి ఇంతవరకూ నిందితులు ఎవరనేది తెలియలేదు. ఈ దాడి మా కార్యకర్తలే చేశారంటూ.. హిందూ రక్షా దళ్  సంస్థ చీఫ్ పింకీ చౌదరీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పథకం ప్రకారమే ఈ దాడి జరిగి ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు అభిప్రాయ పడుతున్నారు.

ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ దాడిలో పాల్గొన్న నిందితులను గుర్తించడం కష్టంగా మారిందని అన్నారు.  అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ సర్వర్ పాడవడం వల్ల ఎవరూ దాడి చేశారనే విషయం తేల్చుకోలేకపోతున్నామన్నారు. ఈ నెల 3 నే సర్వర్ డామేజ్ అయిందని.. ఘటన 5 వ తేదిన జరిగిందని చెప్పారు.

దాడికి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వాట్సాప్ స్క్రీన్ షాట్లను పరిగణనలోకి తీసుకున్నామని, నంబర్లను కూడా గుర్తించామని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆ మొబైల్స్ చాలా వరకూ స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నాయన్నారు పోలీసులు.