జోగులాంబ ఆలయానికి రూ.79 లక్షల ఆదాయం

జోగులాంబ ఆలయానికి రూ.79 లక్షల ఆదాయం

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ పార్కింగ్  వేలం పాట ద్వారా రూ.79.25 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో దీప్తి తెలిపారు. హైదరాబాద్​లోని దేవాదాయ శాఖ కమిషనర్  ఆఫీస్​లో సీల్డ్, ఆన్ లైన్, బహిరంగ వేలంలో హైదరాబాద్ కు చెందిన సురేశ్ కుమార్  పార్కింగ్​ నిర్వహణను దక్కించుకున్నారు. 

గత ఏడాది కంటే రూ.9.25 లక్షల ఆదాయం అదనంగా వచ్చినట్లు ఈవో తెలిపారు. టెంకాయలు, పూజా సామాగ్రి అమ్మకం, చీరల నిర్వహణకు సంబంధించిన వేలం పాటను వాయిదా వేసినట్లు చెప్పారు.