కాల్ సెంటర్‌‌‌‌లో.. ఫర్హానా

కాల్ సెంటర్‌‌‌‌లో.. ఫర్హానా

ఐశ్వర్య రాజేష్ లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఫర్హానా’. నెల్సన్ వెంకటేశన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ టీజర్‌‌‌‌ను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. టీజర్ విషయానికొస్తే..  ఆమె ఒక ముస్లిం 
మహిళ. తన పిల్లల్ని బాగా చదివించాలి.. జీవితంలో వాళ్లకు ఎలాంటి లోటు రాకూడదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు.. ఇవన్నీ నెరవేరడానికి దేవుడే తనకు ఈ ఉద్యోగం ఇచ్చాడని.. నైట్‌‌ కాల్ సెంటర్‌‌‌‌ జాబ్‌‌లో జాయిన్ అవుతుంది. కానీ ఆ ఉద్యోగంలో ఆమెకు ఓ సమస్య ఎదురవుతుంది. దాన్నుండి ఆమె ఎలా బయటపడింది అనేదే మెయిన్ కాన్సెప్ట్‌‌. ‘ఒక్కో పక్షికి అది ఎగరగలిగేంత ఎత్తు, దూరం ఉంటుంది.. అలాగని ఏ పక్షి ఎగరకుండా గూట్లోనే ఉండిపోవడం లేదు’ అనే డైలాగ్ ఆకట్టుకుంది. మొత్తానికి టీజర్‌‌‌‌ ఇంప్రెసివ్‌‌గా ఉంది. శ్రీ రాఘవ, ఐశ్వర్య దత్త, జితిన్ రమేష్, అనుమోల్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మే 12న తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.