న్యూఢిల్లీ: బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్.. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో జర్నలిస్ట్‌ను హెచ్చరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సమావేశం మధ్యలో ఫోన్ రింగింగ్, మాటల వల్ల డిస్టర్బెన్స్ రావడంతో లావ్రోవ్ మొదట ఓపికగా స్పందించారు. ‘మీరు కాసేపు ఇక్కడి నుంచి బయటకు వెళ్తారా? మీరైనా వెళ్లండి లేదా మీ ఫోన్ అయినా పక్కన పెట్టండి’ అంటూ ప్రెస్ మీట్‌ను కొనసాగించే ప్రయత్నం చేశారు. అయినా, సదరు జర్నలిస్ట్ ఫోన్ సంభాషణను ఆపకపోవడంతో, లావ్రోవ్ మరింత సీరియస్‌గా స్పందిస్తూ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ‘దయచేసి ఇక్కడి నుండి వెళ్తారా? నేను జోక్ చేయడం లేదు. మీ ఫోన్‌ను సరెండర్ చేయకపోతే, ఇక్కడున్న మా సెక్యూరిటీ సిబ్బంది గన్(తుపాకీ) తీయాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
