V6 News

అర్జంట్ గా పైసలు కావాలని ఫేక్ ఫోన్ పేతో మోసం

 అర్జంట్ గా పైసలు కావాలని ఫేక్ ఫోన్ పేతో మోసం
  • రూ.20 వేలు క్యాష్​ ట్రాన్స్​ఫర్​చేశామని ఉడాయింపు  

 జూబ్లీహిల్స్, వెలుగు: అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నాయని ఓ వ్యక్తి దగ్గర రూ.20 వేలు తీసుకుని, ఫోన్​పేలో డబ్బులు ట్రాన్స్​ఫర్​చేశామని చూపించి ఉడాయించారు. మొఘల్​పురాకు చెందిన వహీమ్ అహ్మద్ ఖాన్ ఈ నెల 20న టోలిచౌకిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. డబ్బుల కోసం షేక్​పేట్​లోని కరాచీ బేకరీ సమీపంలోని ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి కారులో తన కుటుంబం ఎదురుచూస్తోందని, తనకు అర్జెంటుగా రూ.20 వేలు కావాలని, ఫోన్​పే చేస్తానని చెప్పాడు. అతడిని నమ్మిన వహీమ్​డబ్బులు ఇచ్చాడు.

దీంతో సదరు వ్యక్తి ఫేక్ ఫోన్ పే యాప్ లో వహీమ్ నెంబర్ ఎంటర్ చేసి నగదు ట్రాన్స్​ఫర్ చేసినట్టు చూపించి అక్కడనుండి వెళ్లిపోయాడు. తర్వాత అకౌంట్​లోకి డబ్బులు రాకపోవడంతో ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలు, బండి నంబర్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని బండ్లగూడ వాధియో ఫరాన్ కాలనీ, చాంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ మక్తదర్ రెహమాన్ (23), మహ్మద్ అకిఫ్ (21) గా గుర్తించి అరెస్ట్​ చేశారు.