దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డ జూబ్లీహిల్స్‌‌‌‌ దొంగలు

దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డ జూబ్లీహిల్స్‌‌‌‌ దొంగలు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌‎లో ఇటీవల జరిగిన రూ.20 లక్షల నగదు, డైమండ్ రింగ్, బంగారు ఆభరణాల చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జూబ్లీహిల్స్ పోలీసులు 8 బృందాలుగా గాలించి నేపాలీ గ్యాంగ్​ను దేశ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

జూబ్లీహిల్స్​రవీంద్ర శర్మ నివాసంలో ఇంట్లో పనిమనిషిగా చేరిన ఇద్దరు నిందితులు కొంతకాలం ఇంటి పరిస్థితులను గమనించి, అనుకూల సమయంలో చోరీకి పాల్పడ్డారు. తోటి సిబ్బందికి మత్తు మందు ఇచ్చి చోరీ చేశారు. అనంతరం దేశం విడిచి పారిపోయే ప్రయత్నంలో సరిహద్దు వద్ద పట్టుబడ్డారు. నిందితులను హైదరాబాద్​కు తరలించిన అనంతరం పోలీసులు మరింత సమాచారం వెల్లడించనున్నారు.