- కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ
జూలూరుపాడు, వెలుగు: గంజాయిరవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విలేకరులతో మాట్లాడారు.
బుధవారం సాయంత్రం పీఎస్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు అనుమానాస్పదంగా ఉన్న రెండు కార్లు ఆపి సోదాలు చేశామని, అందులో సుమారు రూ 52 లక్షల విలువ గల 105 కేజీల గంజాయి ని గుర్తించినట్టు తెలిపారు.
ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయిని డొంకరాయి నుంచి ప్యాకెట్ల రూపంలో భద్రాచలం, నుండి ఖమ్మం, హైద్రాబాద్ మీదుగా షిర్డీకి తరలిస్తున్నట్లు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి నాలుగు సెల్ ఫోన్లను,రెండు కార్లను స్వాధీనం చేసుకున్నమన్నారు.
