సంక్రాంతి తర్వాతే షూటింగ్ ప్రారంభం

సంక్రాంతి తర్వాతే షూటింగ్ ప్రారంభం

‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై ఎనిమిది నెలలు అవుతోంది. ఇటీవల జపాన్‌‌‌‌‌‌‌‌లోనూ ఈ చిత్రం విడుదలైంది. కానీ ఇంతవరకూ ఎన్టీఆర్ తర్వాతి చిత్రం మాత్రం మొదలవలేదు. ఎప్పుడెప్పుడు అది స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరోవైపు ఆమధ్య ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కోసం జపాన్‌‌‌‌‌‌‌‌ వెళ్లొచ్చిన ఎన్టీఆర్, వెకేషన్ కోసం భార్య పిల్లలతో కలిసి మరోసారి ఫారిన్ బయల్దేరాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్‌‌‌‌‌‌‌‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెలరోజుల పాటు కుటుంబంతో కలిసి ఫారిన్‌‌‌‌‌‌‌‌ ట్రిప్ ఎంజాయ్ చేయనున్న తారక్‌‌‌‌‌‌‌‌..  సంక్రాంతి టైమ్‌‌‌‌‌‌‌‌కు తిరిగి రానున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల కొరటాల శివ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్, మ్యూజిక్ సిట్టింగ్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఫొటోస్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయడంతో.. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా జనవరిలో షూటింగ్ మొదలవుతుందని భావించారు. టూర్ కారణంగా సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరి నుండి ఈ చిత్రం మొదలవబోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ ప్యాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా బ్లాక్‌‌‌‌‌‌‌‌ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవడంతో పాటు విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ మరింత పెరిగింది. అందుకు తగ్గస్థాయిలో స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌ రెడీ చేస్తున్నాడట కొరటాల. అందువల్లే సినిమా ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, పి.హరికృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.