హైదరాబాద్, వెలుగు: సీపెక్సర్వేపై ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌గా వ్యవహరించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కంచ ఐలయ్యను మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అభినందించారు. ఈ ముగ్గురూ శుక్రవారం వారిద్దరి నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, రాజకీయ, ఆర్థిక కుల గణన సర్వేను ఆద్భుతంగా విశ్లేషించారని కొనియాడారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి, కంచ ఐలయ్యలకు శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను తొలగించేందుకు ఈ కమిటీ చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

