కరీంనగర్ జిల్లాలో ఉద్యోగాలు సాధించిన జ్యోతిష్మతి విద్యార్థులు

కరీంనగర్ జిల్లాలో ఉద్యోగాలు సాధించిన జ్యోతిష్మతి విద్యార్థులు

తిమ్మాపూర్, వెలుగు: చెన్నైకి చెందిన లూమినా డాటామాటిక్స్‌‌‌‌ సాప్ట్​వేర్ సంస్థలో జ్యోతిష్మతి అటానమస్​ఇంజినీరింగ్​కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన రిక్రూట్​మెంట్ డ్రైవ్​లో పాల్గొన్న ఫైనలియర్ విద్యార్థులు కఠినమైన ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి రూ.3 లక్షల ప్యాకేజీతో 12మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 

కాలేజీ చైర్మన్ సాగర్ రావు మాట్లాడుతూ.. తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపి ఉద్యోగాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లూమినా డాటామాటిక్స్ సంస్థ ప్రతినిధులు, కాలేజీ సెక్రటరీ అండ్​కరస్పాండెంట్ సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, అకడమిక్స్ డీన్ అండ్​ఆడిట్ డా. పీకే వైశాలి పాల్గొన్నారు.