Kabzaa Trailer: ఆసక్తిరేపుతున్న ‘కబ్జా’ ట్రైలర్

Kabzaa Trailer: ఆసక్తిరేపుతున్న ‘కబ్జా’ ట్రైలర్

విలక్షణ నటుడు ఉపేంద్ర (Upendra) ‘కబ్జా’ (Kabzaa) అనే ప్యాన్‌‌ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్‌‌.చంద్రు దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రియా హీరోయిన్‌‌. సుదీప్, ప్రకాష్‌‌ రాజ్‌‌, జగపతిబాబు, కబీర్ సింగ్‌‌ దుహా, బోమన్‌‌ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను (Kabzaa Trailer) మేకర్స్ విడుదల చేశారు. స్వతంత్రం రావడానికి ముందు 1945లో జరిగిన కథగా ఈ చిత్రాన్ని మలిచారు. విజువల్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మ్యూజిక్, యాక్షన్స్ సీన్స్, డైలాగ్స్, ఎలివేషన్స్, డార్క్ థీమ్ తో ట్రైలర్ ఆసక్తిరేపుతోంది. మరో కేజీఎఫ్(KGF) ను తలపిస్తోంది.

ఈ నెల 17న వరల్డ్‌‌ వైడ్‌‌గా రిలీజ్ కానుంది. 1945 నుంచి 1984 మధ్య కాలంలో న‌‌డిచే క‌‌థ‌‌ ఇది. స్వాతంత్య్ర స‌‌మ‌‌ర యోధుడు కొడుకు మాఫియా వ‌‌రల్డ్‌‌లో ఎలా చిక్కుకున్నాడు. త‌‌ర్వాత ఏ రేంజ్‌‌కు చేరుకున్నాడ‌‌నే పాయింట్‌‌తో ఈ సినిమాను తెర‌‌కెక్కించారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.